మినిమమ్ గ్యారెంటీ... చక్కని కామెడీతో అలరించిన అల్లరి నరేష్ కు వరుస ఫ్లాపులతో కాస్త నిరాశలో ఉన్నాడు. సొంత చిత్రం ‘బంది పోటు’ కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో ఎలాగైనా హిట్ ఇచ్చి తన ఫ్లాప్స్ కి బ్రేక్ ఇవ్వాలని అనుకున్న నరేష్ ఇప్పుడు 'జేమ్స్ బాండ్ - నేను కాదు నా పెళ్ళాం' సినిమా అయినా హిట్ అవ్వాలనే కసి తో చేశాడట. ఈ చిత్రంలో అతని భార్యగా సాక్షి చౌదరి నటిస్తోంది. గతంలో అల్లరి నరేష్‌తో 'అహనాపెళ్లంట' చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా కూడా కొరియన్ సినిమాకి కాపీ అనే సంగతి ట్రెయిలర్ చూసిన వారంటున్నాడు. కొరియాలో పెద్ద హిట్ అయిన 'మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్‌స్టర్' చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని జేమ్స్ బాండ్ తీశారట. అహనాపెళ్లంట చిత్రం కూడా 'మ్యారీయింగ్ ది మాఫియా' అనే కొరియన్ కామెడీకి ఫ్రీమేక్. అప్పుడు ఆ చిత్రం హిట్ అయ్యింది. ఇప్పుడు జేమ్స్ బాండ్ కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం...