అల్లరల్లరిగా నరేష్ పెళ్ళి సందడి....

May 30, 2015 | 11:57 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Allari_Naresh_wedding_pics_niharonline

తెలుగు సినిమాకు ఈ తరం యువ అల్లరి హీరో నరేష్ వివాహం విరూపతో శుక్రవారం రాత్రి (మే 29) ఘనంగా జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూ వరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి రాజకీయ ప్రముఖులతోపాటు పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సంపూర్ణేష్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు మనోజ్, నాని, ఆది, ఇతర నటీనటులు విచ్చేశారు. ఇక ఈ పెళ్లి వేడుకల్లో యువహీరోలందరూ ఒక చోట చేరి అల్లరోడి పెళ్ళిని అల్లరల్లరిగా సందడి చేశారు. నరేష్ తల్లి సరస్వతి కుమారి, అన్నావదినెలు ఆర్యన్ రాజేష్, సుభాషిణీ అతిథుల్ని గౌరవంగా ఆహ్వానించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ