శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరి నిర్మాణ సారథ్యంలో కిరణ్‌కుమార్ తులసి నిర్మాతగా విష్ణువర్థన్ దర్శకత్వంలో అల్లరి నరేష్, నిఖిత, దివ్య హీరో హీరోయిన్స్‌గా తమిళంలో ఘనవిజయం సాధించిన ఓ చిత్రాన్ని తెలుగులో ‘నా అల్లరి’ పేరుతో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ మొదటి వారంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ తులసి విశేషాలను తెలియజేస్తూ... ‘‘యువతను ఆకర్షించే 5 పాటలకి యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. దర్శకుడి టేకింగ్ స్టయిలిష్‌గా వుంటుంది. ఎక్కడా తగ్గని వినోదం అల్లరి నరేష్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించడమే కాకుండా ఆమె ఒక ప్రత్యేక పాటలో నర్తించడం మరో హైలైట్. పూర్తి వినోదభరితమైన ఈ చిత్రాన్ని జూన్ మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం’’ అన్నారు.
ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, కెమెరా: కృష్ణన్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, నిర్వహణ: తిప్పతి శవకుమార్, నిర్మాత: కిరణ్‌కుమార్ తులసి, స్క్రీన్‌ప్తే, దర్శకత్వం: విష్ణువర్థన్.