బన్నీ దసరా సంబరం నల్లగొండ జిల్లా చింతపల్లిలో?

October 23, 2015 | 03:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
allu-arjun(49)

అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో తెలంగాణ యాసతో అదరగొట్టాడు. మరి ఈ తెలంగాణ యాసకు... అల్లు అర్జున్ కు అవినాభావ సంబంధం ఏర్పడింది. ఆయన సతీమణి స్నేహ రెడ్డిది తెలంగాణ ప్రాంతమే. పుట్టి పెరిగింది సిటీలోనే అయినప్పటికీ... స్నేహ రెడ్డి అమ్మమ్మ ఊరు నల్లగొండ జిల్లా పెద్ద వూర మండలంలోని చింతపల్లి. అంటే స్నేహ రెడ్డి బహుశా ఆ ఊర్లో సెలవుల్లో గడిపే ఉంటారు. ఈసారి బన్నీని కూడా పండుగ సందర్భంగా తన అమ్మమ్మ ఊరుకు తీసుకు వెళ్ళారు. అర్జున్ కూడా ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ బిజీగా గడిపారేమో సరదాగా అలా వెళ్ళొద్దామనుకున్నట్టున్నారు... ఈసారి దసరా పండుగను ఆ ఊళ్లో జరుపుకున్నాడు.  ఈ విషయం తెలిసిన గ్రామస్తులు  అల్లు అర్జున్ ను చూసేందుకు గుమిగూడారు. అర్జున్ చేత గ్రామస్తులు ఇటీవల విడుదలయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి డైలాగ్స్ చెప్పించుకుని ఆనందించారట. అలాగే పలువురు బన్నీతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఒకేసారిగా అందరూ అర్జున్ వద్దకు దూసుకు రాగా వారిని అదుపు చేయడానికి స్నేహ కుటుంబ సభ్యులు చాలా కష్టపడాల్సి వచ్చిందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ