మాస్ డైరక్షన్లో స్టైలిష్ స్టార్

December 23, 2014 | 03:24 PM | 38 Views
ప్రింట్ కామెంట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమాను ముగించే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరిలో చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం తర్వాత బన్నీ ఎవరితో సినిమా తీయబోతున్నాడు. మాటల మాంత్రికుడితో తర్వాత మరేయితర దర్శకుడితో అర్జున్ కమిట్ అయినట్లు వార్త లేదు. అయితే ఇప్పడు ఓ సమాచారం అందింది. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం కొరటాల శివతో ఉంటుందట. ప్రస్తుతం శివ మహేష్ బాబు చిత్రంను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ ఇద్దరు ఫిబ్రవరి వరకు తమ తమ చిత్రాలను పూర్తిచేసుకొని ఫ్రీ అయి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తారని సమాచారం. తొలుత కొరటాల శివ ఎన్టీఆర్ తో చిత్రం ఉంటుందని అనుకున్నారు. అయితే టెంపర్ త్వరగా పూర్తికావటం ఆ సమయానికి కొరటాల మహేష్ తో చిత్రంలో ఉండటంతో ఎన్టీఆర్ సుకుమార్ తో ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. దీంతో కొరటాల కథను వినిపించగా బన్నీ ఓకే చెప్పినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ