భారీ బడ్జెట్ సినిమా రుద్రమదేవి కోసం బ్రూస్ లీ పోస్ట్ పోన్ చేసుకుని ఉంటే బాగుండేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత అక్టోబర్ 16వన రాంచరణ్ తేజ నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా 16న విడుదల చేయడం బ్రూస్ లీ చిత్ర నిర్మాతల తప్పనట్టు మాట్లాడ్డం, రాంచరణ్ ఈ సినిమా వాయిదా ఉండదు అని స్పష్టం చేయడంపై పలువురు విమర్శలకు దిగుతున్నారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ట్విట్టర్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘‘బ్రూస్ లీ సినిమా 16న విడుదల చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించారు. ‘రుద్రమదేవి’ విడుదల తేదిని నిర్మాతలు వాయిదా వేసుకుంటూ ముందుకు తీసుకొచ్చారు.. షెడ్యూల్ ప్రకారం ‘రుద్రమదేవి’ సెప్టెంబర్ 4న విడుదల కావాల్సింది. అక్టోబర్ 9న విడుదలయ్యింది. బ్రూస్‌లీ మాత్రం అనుకున్న డేట్ 16కే విడుదల చేయాలనుకున్నారు. ఆ విషయం తెలిసే నిర్మాతలు ‘రుద్రమదేవి’ చిత్రాన్ని అక్టోబర్ 9న విడుదల చేశారు. దీనికి బ్రూస్‌లీ నిర్మాతల్ని తప్పు పట్టనవసరం లేదు. ఈ రెండు చిత్రాలూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపాడు గన్నారెడ్డి. ఈ విషయంలో అల్లు అర్జున్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాడని రాంచరణ్ కూడా వివరించాడు. అదే విషయాన్ని అల్లు ఈరోజు తెలిపారు.
ఇప్పటికే రుద్రమదేవి సక్సెస్ టాక్ తో నడుస్తోంది. ఈ విధంగా మరో మూడు వారాలు నడిస్తే గుణశేఖర్ డబ్బు తిరిగి రాబట్టుకోవడమే కాదు లాభాల బాట పట్టినట్టవుతుంది.