పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరిగింది. గౌరవంతో కెరీర్‌ను మొదలుపెట్టిన అల్లు శిరీష్ ఇటీవల కొత్తజంటతో మంచి సక్సెస్‌నే చవిచూశారు. యువత, ఆంజనేయులు, సోలో సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ సారొచ్చారు తర్వాత ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లవ్‌స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాగా ఈ సినిమాను రూపొందించాలని నిర్ణయించారు.