ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పనికి తాను ఆంధ్రా పౌరుడినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. దేశ వ్యాప్తంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చారని ట్విట్టర్ లో ఆరోపించారు. కేసీఆర్ ముక్కు సూటి తననానికి తాను శిరస్సు వంచి వందనం చేస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా పనిచేసేవారని, దూకుడుగా ఉండేవారని అనవసరంగా ఓటుకు నోటు వ్యవహారంలో చిక్కుకున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు కూడా చిక్కుకోకుండా ఉంటే బాగుంటుందన్నారు. తాను ప్రత్యేకంగా ఒక ప్రాంతం ఉద్దేశించి చెప్పేవాడిని కాదని, అయితే, తన ప్రాంతంతో పోలిస్తే చంద్రబాబు కంటే కేసీఆర్ ముందున్నారని ప్రశంసించారు.