గతేడాది డిసెంబర్ 19న క్రిస్ మస్ కానుకగా విడుదలైన చిత్రం ‘పీకే’. బాలీవుడ్ సూపర్ స్టార్, రాజ్ కుమార్ హీర్వాణీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాకుండా దాదాపు 650 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. అయితే అదేవిధంగా కొన్ని వర్గాల ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా సినిమా ఉందని కూడా దుమారం రేగింది. అయితే అప్పట్లో అమీర్ ఖాన్ కానీ, చిత్రయూనిట్ కానీ ఈ విషయమై ఏమీ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా డివిడి లాంఛ్ లో పాల్గొన్న అమీర్ ఖాన్ ఈ సినిమా చాలా మందికి నచ్చింది. అయితే కొంత మంది మనోభావాలను దెబ్బతీసిందని కూడా వివాదం చెలరేగింది. అయితే మాకు ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచనలేదు. ఈ సినిమా కారణంగా అలాంటిదేదైనా జరిగి ఉంటే క్షమించండి అంటూ తెలియజేశారు.