బాలీవుడ్ ప్రముఖ నటులు అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సైఫ్ అలీఖాన్ ల భార్యలు కూడా లవ్ జిహాద్ బాధితులేనని హిందూ మహాసభ పేర్కొంది. ఈ విషయాన్ని హిందూ మహాసభ తన వారపత్రిక అయిన హిందూ సభా వార్తా తాజా సంచికలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొంది. ఈ ముగ్గరు ఖాన్ లకు నిజంగా తమ భార్యలపై ప్రేమ ఉంటే వారే హిందూ మతంలోకి రావాలని కూడా ఆ సంపాదకీయం పేర్కొంది. ప్రస్తుతం ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తోంది. మరోవైపు కరీనా కపూర్ ముఖ చిత్రంతో లవ్ జిహాద్ పేరిట ఓ మ్యాగ్జైన్ కవర్ పేజీ ని ప్రచురించిన విషయం తెలిసిందే.