ఒక్కోసారి మనకు చెందిన ఎన్నో ఫొటోలు మన బంధువుల ఇంట్లో చూసి ఆశ్చర్యపోతుంటాం... వారి పెళ్ళి వేడుకల్లోనో, ఇతరత్రా పార్టీ ఫొటోల్లో ఎక్కడో మనం తటస్థ పడవచ్చు. అలా ఏవైనా కొన్నేళ్ళ క్రితం ఫొటోలు లేదా అభిరుచి గలవారి జ్నాపకాలు ఏవైనా వారికి కనిపిస్తే ఎంతో అపురూపంగా అనిపిస్తాయి... ఇప్పుడు బిగ్ బీకి వాళ్ళ నాన్న ఫొటోలు లేదా ఆయన వ్యాసాలు, కథలు సేకరించాలనే ఆలోచన కలిగింది. అమితాబచ్చన్ తన తండ్రి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ కోసం ఓ వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తండ్రి డాక్టర్ హరివంశ్ బచ్చన్ రాయ్ పేరుపొందిన కవి. ఆయనకు సంబంధించిన ఫొటోలు, వాటి వివరాలు అభిమానుల దగ్గర ఉంటే తనకు పంపాలని కోరారు. దీనికి సంబంధించిన ఆయన సమగ్రమైన వెబ్ సైట్ ఒకటి ప్రారంభించాలనుకున్నారట. సరైన సమాచారం ఇవ్వడమే దాని వెనకున్న ఉద్దేశమట. చాలా సైట్లు ఆయనకు సంబంధించిన వివరాలు ఇవ్వలేకపోతున్నాయంటున్నారు. ప్రస్తుతం హరివంశ్ రాయ్ కు సంబంధించిన వివరాలను, ఫొటోలను బిగ్ బీ సేకరిస్తున్నారు. ఆయనకు సంబంధించిన కవితలు, వివరాలు, సమాచారం. లేఖలు, కథలు, ప్రసంగాలు, సంభాషణలకు సంబంధించిన వివరాలు ఏవైనా సరే తనకు పంపాల్సిందిగా ఆయన కోరుతున్నారు. ఈ వివరాలన్నిటినీ thebachchanfamily@gmail.com మెయిల్ చేయాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.