ఫిల్మ్ ఫేర్ 2015 అవార్డుల ఉత్సవం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. నటీనటుల అందాన్నీ, స్టైల్ ను పరిగణలోకి తీసుకుని ఈ వేదిక కొంతమంది తారలకు ప్రత్యేకంగా అవార్డులిచ్చింది. ఫిబ్రవరి 26న జరిగిన ఈ ఉత్సవంలో అమితాబ్ బచ్చన్ కు ఆల్ టైమ్ గ్లామర్ నటుడిగా అవార్డునిచ్చి సత్కరించింది. ఈ వయసులోనూ ఆయన పిల్లిగడ్డం స్టైల్ ను కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఫాలో అవుతున్నారంటే, అతన్ని గ్లామర్ ఐకాన్ గా గుర్తించి తీరాల్సిందే. ఇదే అవార్డు ఫీమేల్ జాబితాలో శ్రీదేవి, మాధురీ దీక్షిత్ లు అందుకున్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘హాపీ న్యూఇయర్’ గ్లామరస్ మూవీగా అవార్డును అందుకోగా, మోస్ట్ గ్లామరస్ డైరెక్టర్ గా కరణ్ జోహార్ అవార్డును అందుకున్నాడు. అలియాభట్, సిద్దార్థ మల్హోత్రా ఎమర్జింగ్ ఫేస్ ఆఫ్ ఫేషన్ అవార్డును, ఇక బాలీవుడ్ లో మోస్ట్ ఫాషన్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న సోనమ్ కపూర్ ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ది ఇయర్, మోస్ట్ స్టైలిస్ ఫిమేల్ స్టార్ అవార్డును అందుకున్నారు. షారూఖ్ ఖాన్, కాజోల్ లు తెరమీద అందాలు కురిపించిన జంటగా అవార్డును అందుకోగా, ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ నిజజీవితంలో అందరినీ ఆకట్టుకున్న జంటగా అవార్డు లు అందుకున్నారు. ఇక అందరికంటే స్టైలిష్ గా ఉండే మేల్ యాక్టర్ గా అందరూ రణ్వీర్ సింగ్ గా భావించారు. కానీ ఈ అవార్డు ఇమ్రాన్ ఖాన్ ను వరించింది.