పెద్దాయనకు ఆ జబ్బు ఓసారి వచ్చిందట

December 22, 2014 | 05:22 PM | 20 Views
ప్రింట్ కామెంట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పుడు వార్తల్లో వచ్చిన అభిమానుల్లో కలకలం రేగుతుంది. ఆయన ఆరోగ్యం మెరుగవ్వాలని కొరుకునే ఆయన ఫ్యాన్స్ బాగుపడ్డాక దేవుళ్లకు మొక్కులు కూడా తీరుస్తారు. అభిమానుల అండ దండలు, వారి ఆశీస్సుల వల్లే ఈ రోజు ఇంకా బతికి ఉన్నానని బిగ్ బీ పలు సందర్భాలలో చెబుతుంటారు. అయితే ఫ్యాన్స్ కు తెలీకుండా దాచిన ఓ విషయాన్ని ఆయన ఇన్నాళ్లకు బయటపెట్టారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమ సమయానికి ముందు ఆయన క్షయ వ్యాధి బారిన పడ్డారట. ముంబై నగర పాలక సంస్థ తరపున క్షయ వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ ఈ విషయాన్ని చెప్పారు. ‘‘ వ్యక్తిగతంగా సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలోనే నాకు క్షయ సోకింది. కానీ, విషయాన్ని నేను బయటికి రానివ్వలేదు. వ్యాధి సోకినప్పుడు నేనేం అధైర్యపడలేదు. అదేమంత పెద్ద జబ్బు కాదు. సరైన జాగ్రత్త చర్యలు తీసుకొని మందులు వాడితే తొందరగా నయమైపోతుంది’’ అని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం బాలేదంటే ఫ్యాన్స్ పడే మధనేంటో బిగ్ బీ కి బాగా తెలుసుకదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ