మనవరాలి ముద్దు ముద్దు మాటలను చూసి మురిసిపోతున్నాడు బాలీవుడ్ మెగాస్టార్ , బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ ల గారాలపట్టీ, మూడేళ్ల ఆరాధ్య పెద్ద వసపిట్టని, ఆగకుండా మాట్లాడుతూనే ఉంటుందని తన బ్లాగ్ లో పొంగిపోయాడు. ఆరాధ్య వయస్సుకు మించిన మెచ్యూరిటీ చూపిస్తోందని ఆనందపడుతున్నాడు. ఇంట్లో జరిగే కబుర్లను మనవరాలు ఆరాధ్య నోట విని ఆనందిస్తున్నట్లు 72 ఏళ్ల అమితాబ్ అంటున్నాడు. ఊహించేందుకు కూడా వీలులేని ప్రశ్నలను సంధిస్తోందని, ఈ సమయంలో ఆరాధ్యతో కలిసి ఉండటం తన జీవితంలోనే అత్యుత్తమ సమయమని ఆయన తెలిపారు.







