'ఐ' చిత్రం ద్వారా నార్త్ సౌత్ లో పాపులర్ అయిన అమీ జాక్సన్ తండ్రి అలెన్ జాక్సన్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ప్రస్తుతం అమీ జాక్సన్ విఐపీ 2, రఘువరన్ బిటెక్ సీక్వెల్ సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉంది. విషయం తెలిసిన వెంటనే అమీ తండ్రిని చూడటానికి లండన్ వెళ్లిపోయింది. అమీ జాక్సన్ కు తండ్రితో అనుబంధ ఎక్కువే అని తెలుస్తోంది. ఆమె ఏ విషయాన్నయినా తండ్రితో షేర్ చేసుకుంటుందట. ఫాధర్స్ డే సందర్భంగా ఆమె తన తండ్రితో దిగిన ఫొటోని షేర్ చేసి,..మేము మా కుటుంబం లేకుండా లేము..లవ్ యు డాడ్..నువ్వు లేకపోతే మేం లేము...నువ్వు మాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ రాసుకుంది. అలా రాసిన రెండు రోజులకే తండ్రికి హార్ట్ స్ట్రోక్ అన్న వార్త వినాల్సి వచ్చింది.