సినీ రంగంలోకి పదహారేళ్ళ పడుచుపిల్లల్నిఆహ్వానించి సినిమాల్లో నటింప చేస్తుంటే... యాంకరమ్మ అనసూయ మాత్రం ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక సినిమాల్లోకి ఎంటరైంది అది కూడా సీనియర్ నటుడు నాగార్జునతో చిందులేసేసింది. తల్లయిన తరువాత కూడా ఏ మాత్రం తరగతి అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంటర్టెన్మెంట్ రంగంలో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ తరచూ ఫోటో షూట్లలో హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో ఆకర్షిస్తూండడంతో ఇప్పుడు పలు సంస్థలు ఆమెతో తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించడానికి ముందుకొస్తున్నాయి. తాజాగా తేజ సారీస్ కోసం ఆమె ప్రత్యేకంగా ఫోటో షూట్లో పాల్గొంది. బ్రైట్ ఎల్లో జాకెట్టు, లైట్ గ్రీన్ లెహంగా ధరించిన అనసూయ అలా రింగులు తిరుగుతూ పరికిణీ గేరా చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో నాగార్జునతో అనసూయ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇందులో అనసూయ నాగార్జున మరదలి పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఓ పాటలో నాగార్జునతో కలిసి డాన్స్ కూడా చేస్తోంది. సినిమా రంగంలో తల్లయినా పదహారేళ్ళ పడుచుపిల్లలా నటించే అవకాశం అనసూయకే దక్కిందనుకుంటా...