బుల్లితెర యాంకర్ ఓంకార్ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఇంద్ర, నరసింహానాయుడు లాంటి బ్లాక్ బస్టర్ లకు కథ సమకూర్చిన చిన్నిక్రుష్ణ సహాకరంతో జీనియస్ అనే డిజాస్టర్ తీశాడు. ఆ సందర్భంలో ఈ యాంకర్ అన్నయ్య చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. దీంతో ఇప్పుడు సైలెంట్ గా తన రెండో చిత్రం పనులు కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న కథ సస్పెండ్ కామెడీతో కూడిన కథాంశంగా కేవలం ఏడు పాత్రలతో తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఎలాగైనా ఈ చిత్రంతో హిట్ కొట్టి దర్శకుడిగా తన ప్రతిభ ఏంటో చూపాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడట. ఆల్ ది బెస్ట్ ఓంకార్ అన్నయ్యా...