ఈ మధ్య కాలంలో చిన్న చిన్న కారణాలతో కోర్టు గడపలెక్కడం సర్వ సాధారణమైపోయింది. అది కూడా సినిమా వాళ్ళపై మరీనూ... ‘మా మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటూ కేసులు పెట్టేస్తున్నారు. సినిమాల్లో ఎక్కడో ఓ చోట తప్పుపట్టి కేసు పెట్టేద్దాం... అన్న చందంగా తయారైంది వ్యవహారం. ఇప్పుడు ఈ మనోభావాల దెబ్బ ‘ఆంధ్రా పోరి’ సినిమాపై పడింది. ప్రముఖ నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్న ఆంధ్రాపోరి సినిమాలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరోగా నటించాడు. హీరోయిన్ ఉల్కా గుప్తా. అయితే ఈ టైటిల్ తో ఆ ప్రాంతపు వారిని కించపరచడమే అవుతుంది అంటూ ‘ఆంధ్రా సెటిలర్స్ ఫోరం’ కోర్టుకెక్కింది. అంతే కాదు, వెంటనే సినిమా టైటిల్ను మార్చాలంటూ, ఇందులో తెలగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని కూడా అపోనెంట్ గా వర్ణిస్తూ ఓ పిటిషన్ వేశారు. అసలు పోరీ అంటూ ఓ అమ్మాయిని అనడం మహిళా లోకం అంతా సిగ్గు పడాలని అంటున్నారు. ఈ విషయమై హైకోర్టు విచారణ జరపనుంది. గత ఆరు నెలలుగా ఈ చిత్ర నిర్మాణం జరుపుకుంటున్నా.... పేపర్లలో, పోస్టర్ల ద్వారా ఎన్నో సార్లు ఈ టైటిల్ బయటికి వచ్చినా మాట్లాడని వారు, ఇప్పుడు విడుదలకు ముందు ఎందుకు ఈ ఆలోచన వచ్చినట్టు. విడుదలకు ముందు సినిమా వాళ్ళను కాస్త టెన్షన్ పెట్టి లాభపడదామని తప్ప...