దేవాంశ్ కు అన్నప్రాసన

October 19, 2015 | 04:14 PM | 4 Views
ప్రింట్ కామెంట్
balakrishna_grand_son_annaprasana_ceremony_niharonline_(14)

చిన్నారి సెలబ్రిటీ దేవాంశ్ కు శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నప్రాసన జరిగింది. ఇద్దరు తాతలూ ఒకరు రాజకీయ ప్రముఖులైతే, ఒకరు సినీ ప్రముఖులు (ఎమ్మెల్యేకూడా). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, లెజెండ్ బాలయ్య ముద్దుల మనుమడు... లోకేష్, బ్రహ్మిణి దంపతుల కుమారుడు దేవాంశ్ కు ఈ వేడుక జరిపారు. ఆనాడు తాత హోదాలో ఎన్టీ రామారావు తన కొడుకు కూతురైన బ్రహ్మిణి కి, కూతురు కొడుకైన లోకేష్ కి తిరుమలలోనే అన్న ప్రాసన చేశారట. ఇప్పుడు అదే తిరుమలలో వీరి పుత్రునికి ఇద్దరు తాతలు అన్నప్రాసన చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో నారా వారి వారసుడికి నేడు ఆ వేడుక జరిపారు. ఇందుకోసం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ దంపతులతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు ఇప్పటికే  తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దేవాంశ్ పేరిట రూ. 20 లక్షలను అన్నదాన పథకానికి విరాళంగా ఇచ్చారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ