షారూఖ్ కు మరో డాక్టరేట్

October 17, 2015 | 04:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sharukh-award-niharonline

బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ గౌర‌వ డాక్టరేట్ అందుకున్నారు. యూకేలోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గురువారం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో షారూఖ్ ఖాన్‌కు డాక్టరేట్‌ను అందించారు. షారుఖ్ గత కొన్నేళ్ళుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు, సినిమాల్లో అతని నటనకు గాను ఎడిన్ బర్గ్ యూనివర్శిటీ ఛాన్స్లర్ ప్రిన్సెస్ రాయల్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించారు. గ్రామాలకకు సోలార్ విద్యుత్ అందించడం, పిల్లల కోసం ముంబైలో ఓ హాస్పిటల్ స్థాపించడం వంటి బృహత్తర కార్యక్రమాలు షారూఖ్ చేపట్టారు. 
ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ లోని లుంగీ డాన్స్ పాటకు మరోసారి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఈ డాక్టరేట్ ప్రదానోత్సవంలో సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. షారుఖ్ స్పీచ్ తరువాత విద్యార్థుల కోరిక మేరకు సంప్రదాయ నృత్యంతో పాటు లుంగీ డాన్స్ చేశారు. ఆడిటోరియం అంతా విద్యార్థుల కేరింతలతో హోరెత్తింది. డాక్టరేట్‌ను అందుకున్న షారుక్ ట్విట్టర్ ద్వారా ప్రొఫెసర్లు జెఫ్రీ, స్మిత్ తో పాటు పలువురికి ధన్యవాదాలు తెలిపారు.
గతంలో బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ విశ్వవిద్యాలయం నుంచి మొదటి డాక్డరేట్ స్వీకరించారు షారుఖ్.  బుల్లి తెర నుంచి త‌న ప్రస్థానం ప్రారంభించిన షారూఖ్ అంచెలంచెలుగా అత్యున్న‌త స్థాయికి ఎదిగాడు. రెండున్న‌ర‌ ద‌శాబ్దాలుగా బాలీవుడ్ అగ్ర‌హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు. 2005లో ప‌ద్మ శ్రీ ని కూడా అందుకున్నాడు. ఎడిన్ బ‌ర్గ్ యూనివ‌ర్సిటీతో ఇండియాకు దాదాపు 250 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఇందులో భాగంగానే భార‌త్‌లో వివిధ రంగాల్లో సేవ‌లందించిన ప్ర‌ముఖుల‌కు డాక్ట‌రేట్ అందించి స‌త్క‌రిస్తోంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ