బాహుబలి, రుద్రమదేవి సినిమాల తరువాత ఇక అనుష్క ఎవరి సినిమాలకూ ఒకే చెప్పడం లేదనీ, ఇంట్లో పెళ్ళి చేసుకొమ్మని పోరు పెడుతున్నట్టు వార్తలు చాలానే వచ్చాయి. అనుష్క భాగమతిలో నటించడం లేదనీ, ఆ ఛాన్స్ అంజలి కొట్టేసిందని ఒక వార్తయితే, లేదు లేదు అనుష్కే నటిస్తుందంటూ మరో వార్త. ఈ గాలి వార్తలు ఎలా ఉన్నా, ఎప్పటినుంచో తాను ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు స్క్రిప్టు రెడీ చేసుకున్నాడట దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ఆయన చాన్నాళ్ళనుంచి ఈ సినిమాకు అనుష్కను అడుగుతున్నట్టు గా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకు అనుష్క ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మార్చి ఫస్ట్ వీక్‌లో సెట్స్ పైకి వెళ్తుందట. ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకత్వం వహిస్తుండగా హీరో, నిర్మాత ఎవరనే విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.