అనుష్క నిత్యామీనన్ ని పెళ్ళి చేసుకుంటుందా?

October 09, 2015 | 04:57 PM | 4 Views
ప్రింట్ కామెంట్
anushka-is-husband-of-nityamenon-niharonline

అవునట... రుద్రమదేవి సినిమాలో అనుష్క నిత్యామీనన్ ను పెళ్ళి చేసుకుంటుందట. ఇదేంటని ముఖం చిట్లించుకోకండి.  సినిమా చూస్తే ఆ వ్యవహారం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది.  ఈ రోజు విడుదలైన అనుష్క సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వినిపిస్తోంది.  అయితే కథలో అనుష్క రుద్ర దేవగా (మగాడిగా) కనిపిస్తుంది. రుద్ర దేవ తండ్రి (కృష్ణం రాజు), మంత్రి శివదేవయ్య (ప్రకాష్ రాజ్) కలిసి రుద్ర దేవకు ముమ్మిడాంబను( నిత్యామీనన్) ఇచ్చి వివాహం చేస్తారు.  ఇది సినిమాలో నిజంగా జరిగిన కథ. కానీ ఇలా ఎందుకు చేస్తారనేది సినిమా చూస్తేగానీ తెలియదు. మరి రుద్రదేవ రుద్రమగా ఎప్పుడు కనిపిస్తుంది. మళ్ళీ ఆమె చాళుక్య వీరభద్రుడిని ఎప్పుడు ప్రేమిస్తుందో? ముమ్మిడాంబ ఏమవుతుంది? ఇవన్నీ తెలియాలంటే చారిత్రాత్మక సినిమా రుద్రమదేవిని చూడాల్సిందే. 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ