ఎందుకంటారా? సైజ్ జీరో కోసం అమాంతం దాదాపు 20 కేజీల బరువు పెరిగిన అనుష్క తిరిగి సన్నబడేందుకు నానాప్రయత్నాలు చేస్తుంది. ఇంకో మూడు నెలలో ఆమె తిరిగి యథాస్థితికి వచ్చేయాలి. అప్పుడే బాహుబలి 2 లో ఆమె నటించేందుకు సిద్ధమైనట్లు. ఈ లోపు ఆమె మరో ప్రాజెక్టుకు కూడా అంగీకారం తెలిపింది. అదే తమిళ్ హీరో సూర్య హిట్ సిరీస్ సింగం 3. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ మరోసారి అభిమానులను అలరించనుంది. అయితే ఈ చిత్రం కోసం ఎట్టి పరిస్థితుల్లో బరువు తగ్గాలని సూర్య అనుష్కపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.
తొలి రెండు భాగాల్లో ప్రేమికులుగానే మిగిలిపోయిన ఈ జంటకు మూడో భాగంలో పెళ్లి చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు. అయితే ఈ మూవీలో సూర్య, అనుష్కల జోడీకి పిల్లలు కూడా ఉంటారనే సమాచారం తెలుస్తోంది. దీంతో గృహిణి పాత్రకు తగ్గట్టుగా అనుష్కను కొంచెం బరువును అలానే మెయింటెన్ చేయాలని దర్శకుడు హరి సూచించాడట. దీంతో అనుష్క హ్యాపీగా ఫీలవుతుందని సమాచారం.