రజనీ కాంత్ వియ్యంకుడు, ధనుష్ తండ్రి డైరెక్టర్ కాస్తూరి రాజాకి మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. కస్తూరి రాజా సినిమా ఫైనాన్సర్ ఎస్. ముఖన్చంద్ బోత్రా, అతని కొడుకు గగన్ నుంచి 2012లో 62 లక్షలు అప్పుతీసుకున్నాడు. పూచీ కత్తుగా రెండు చెక్కులను ఆయనకు ఇచ్చారు. ఆ సొమ్ము డ్రా చేసుకునేందుకు చెక్ బ్యాంకులో వేయగా, బ్యాంకులో నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. సదరు ఫైనాన్సర్ చెన్నయ్ జార్జ్ టౌన్ మెట్రో పాలిటన్ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇది న్యాయమూర్తి కోదండరాజ్ ఎదుట విచారణకు వచ్చింది. కస్తూరిరాజా తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో.. బెయిల్ అవకాశమున్న అరెస్టు వారెంట్‌ను జారీచేశారు. అనంతరం ఈ కేసును రానున్న 13వ తేదీకి వాయిదా వేశారు.