బన్నీ చేసిన ఫోన్ తనలో ఎనర్జీని మరలా నింపింది అని అంటున్నాడు యువ హీరో సందీప్‌కిషన్. ఈ యువకుడు నటించిన సినిమా టైగర్. రాహుల్ రవీంద్రన్, సీరత్ ఇద్దరూ కీలక పాత్రల్ని పోషించారు. వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్న తరుణంలో బన్నీ ఫోన్ చేయడం ఆనందాన్ని రెట్టింపు చేసిందని అన్నారు సందీప్. దీని గురించి మాట్లాడుతూ ``బన్నీ అన్న ఫోన్ చేసి కంగ్రాట్స్ సినిమా బాగా నచ్చింది`` అని అన్నారు. చాలా బూస్టప్‌గా అనిపించింది అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు సందీప్.