కొద్ది రోజుల క్రితం యాక్టు 66ఎ ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో వర్మపై ఎలా కేసు పెట్టాలో తెలియని పోలీసులు తికమక పడ్డారు. ఇక ఇది సద్దుమణిగినట్టే అనుకునే టైంకు మళ్ళీ అరెస్టు వారెంట్ వర్మను వెంటాడింది. ఆయన ఎప్పుడూ ఎవరినో ఒకరిని కామెంట్ చేయడం వాళ్ళు కేసులు పెట్టడం మామైలైపోయింది. ఇటీవల డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ ఓ సైతాన్ లాంటివాడు... అంటూ ట్విటర్‌లో కామెంట్లు చేసి వివాదంలో చిక్కుకున్నాడీ దర్శకుడు. దీనిపై ఆగ్రహించిన అతని అభిమానులు బాబాను ఇంతలా విమర్శిస్తాడా అంటూ పోలీస్ కేసు పెట్టారు. ట్విటర్‌లో కామెంట్ చేసినందుకు సైబర్ క్రైమ్ కింద ఐటీ యాక్టు 66 A, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినందుకు సెక్షన్ 298 కింద వర్మపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుల కింద వర్మకు నోటీసులు జారీచేద్దామని ప్రయత్నించిన పంజాబ్ పోలీసులకు ముంబైలో ఆయన ఆచూకీ దొరకలేదట. దీంతో తర్వాతి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఐటీ యాక్టు 66 Aని సుప్రీం కోర్టు కొట్టేసినప్పటికీ, సెక్షన్ 298 కింద అతడు విచారణ ఎదుర్కొనక తప్పడం లేదు.