త్రిష పెళ్ళి మూన్నాళ్ళ ముచ్చటైంది

May 08, 2015 | 01:40 PM | 63 Views
ప్రింట్ కామెంట్
trisha_marriage_cancil_niharonline

వరుణ్ ల పెళ్లి ఆగిపోయిందని ఇప్పటి వరకూ నడిచిన ఊహాగాలు తెరపడింది.  త్రిష, వరుణ్ ల పెళ్లి కాన్సిల్ చేసుకుంటున్నట్టు త్రిష తల్లి ఉమాకృష్ణన్ ప్రకటించారు. దాన్ని త్రిష కూడా సోషల్ మీడియా ద్వారా బలపరచింది. త్రిష పెళ్ళెప్పుడు అని ఎదురు చూసిన అభిమానులకు ఇదొక షాకింగ్ న్యూసే... త్రిష పెళ్ళి ఊసే ఎత్త కుండా సినిమాలకు ఒప్పుకుంటుండడంతో అందరూ ఇదేంటని? పరి పరి విధాల ఊహాగాలు చేస్తుండడం... ప్రసార మాధ్యమాల్లో రోజుకో వార్త వస్తుండడంతో కొన్ని వార్తల్లాగే ఇదీ పుకారేమో... అనుకున్నారు. కానీ ఆ వార్తలు నిజమేనని తేల్చేసింది త్రిష. కానీ కారణాలు మాత్రం తెలియజేయలేదు. ఇప్పుడు తన కూతురు సినిమాలపైనే ద్రుష్టి పెట్టిందని చెప్పింది త్రిష కూడా ‘నేనిప్పుడు ఒంటరిగా, సంతోషంగా వున్నాను థ్యాంక్యూ’ అంటూ త్రిష సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంది. ఇక త్రిష పెళ్ళి ముచ్చట మూన్నాళ్ళ ముచ్చటైనట్టే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ