‘మధుర ఆడియో’ ద్వారా జులై 7న విడుదలైన ‘సినిమా చూపిస్త మావ’ ఆడియోకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ‘మధుర ఆడియో’ అధినేత ‘మధుర శ్రీధర్’. ఎఫ్.ఎంలో ఈ ఈ చిత్రంలోని పాటలు రింగ్‌టోన్స్‌గానూ పెద్ద సంఖ్యలో డౌన్‌లోడ్ అవుతుండడం తమకు చాలా సంతోషాన్నిస్తోందని శ్రీధర్ అంటున్నారు. ఈ సందర్భంగా ‘మధుర ఆడియో’ ఆధ్వర్యంలో ఆగస్టు 5న ఈ చిత్రం సంగీత విజయోత్సవాన్ని జరుపుతున్నామని తెలిపారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్, అవికాగోర్ నటిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం ఫస్ట్ కాపీ ఈవారంలో సిద్ధం కానుంది. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి.. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్-ఆర్.డి.జి ప్రొడక్షన్స్ ప్రై॥లి॥ సంయుక్త సమర్పణలో.. ఆర్యత్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్ (గోపి)-రూపేష్ డి.గోహిల్-జి.సునీత నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీత దర్శకుడు. భాస్కరభట్ల రవికుమార్-వనమాలి-కృష్ణచైతన్య-ప్రసన్నకుమార్ సమకూర్చిన సాహిత్యానికి రమ్య బెహరా-లిప్సిక-అనుదీప్-దిన్‌కర్-సింహా-లక్కీ రాజుతోపాటు సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర గాత్రమందించారు.
రావురమేష్, బ్రహ్మానందం, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్, సినిమాటోగ్రఫి: సాయిశ్రీరామ్-దాశరధి శివేంద్ర, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-బెక్కెం వేణుగోపాల్(గోపి)-రూపేష్ డి.గోహిల్-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన!! ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: క్రాంతి కె.కుమార్, మ్యూజిక్: కనిష్క్, స్టిల్స్: నాగభూషణం, నిర్మాత: భరత్ కుమార్ పీలం, రచన,దర్శకత్వం: ఫిరోజ్ రాజ.