బంతి పట్టుకుని ప్రత్యర్థుల మీదకు లంఘించే ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కి ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనే కోరిక కలిగింది. ‘అన్ ఇండియన్’ టైటిల్ తో నిర్మితమవుతున్న ఓ బాలీవుడ్లో సినిమాలో ఈయన కనిపించబోతున్నాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సంస్కృతీ, సంప్రదాయాల నేపథ్యంలో తీస్తున్న ఈ సినిమాలో భారత్కు చెందిన వితంతువుతో ప్రేమలో పడే పాత్రలో బ్రెట్ లీ నటిస్తున్నాడు. బెంగాల్ నటి తనిష్ట ఛటర్జీ ఇందులో ముఖ్యమైన పాత్ర చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ సాంగ్ చిత్రీకరణ మొదలైంది. ఇందులో ఛటర్జీ- బ్రెట్ లీ మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు అనుపమ్ శర్మ షూట్ చేస్తున్నాడు. క్రికెట్ అభిమానులు ఈ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట.