‘బాలికా వధు’ సీరియల్ తో దేశమంతా గుర్తింపు పొందిన అవికాగోర్ మళ్ళీ బుల్లి తెరకు వెళ్ళనున్నదట. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రాల్లో నటించింది. ఒకటి సక్సెస్, ఒకటి ఫ్లాప్. దీంతో అవకాశాలు తగ్గాయేమో మళ్ళీ వెనక్కు వెళ్ళిపోతోంది. సినిమా ఛాన్సు రాగానే ’ససూరాల్ సిమర్ కా’ సీరియల్ నుంచి తప్పుకొని ఉయ్యాల జంపాల సినిమాలో నటించింది. అయితే ఇప్పుడు మళ్లీ తాను ఆ సీరియల్లో నటిస్తానని చెప్పడంతో ఈమెకు మరో కొత్త పాత్రను ఇచ్చారట. ఆ మధ్య గ్లామర్ పాత్రలో నటించాల్సి వస్తే పవన్ కళ్యాన్ తో కూడా నటించనని సంచలనం రేపిన అవికా, తెలుగులో ఇక లాభం లేదనుకుందేమో, మళ్ళీ నార్త్ స్టయిల్ చుడీ చున్నీలు ధరించేందుకు బుల్లి తెరలో దూరిపోతోంది. కానీ తాను ఎక్కడైనా నటనను చాలా ఎంజాయ్ చేశాననీ, మళ్ళీ సీరియళ్ళలో నటించడం కూడా సంతోషంగానే ఉందని చెప్పుకుంటోందీ చిన్నారి పెళ్ళికూతురు.