సినిమా ఇండస్ట్రీలో ఇది కామన్ కదండీ... ఆ ఫీల్డులో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లనో లేదా వారి సుపుత్రులనో ప్రేమ ముగ్గులోకి దింపడం నటీమణులకు సర్వ సాధారణం. ఈ తరహాలోనే ఓ తెలుగు దర్శకుడి తనయుడు నటి అవికా గోర్ ప్రేమలో చిక్కాడు. అనుకోకుండా ఏర్పడిన వీరి పరిచయం స్నేహంగా మారింది. కాలక్రమంలో అది ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వారిద్దరు ‘తను-నేను’ అనుకుంటూ కాలం గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రీల్ లైఫ్ అని ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది..
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి అవికా గోర్.. ‘ఉయ్యాల జంపాల’ చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ చిత్రం ద్వారా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ అమ్మడికి తెలుగులో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ‘తను-నేను’ అనే చిత్రంలో కథానాయికగా నటించే అవకాశం దక్కించుకుంది. ‘గోల్కొండ హై స్కూల్’, ‘ఉయ్యాల జంపాలా’ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన పి. రామ్మోహన్.. ఇప్పుడు దర్శకుడిగా అవతారమెత్తి ‘తను-నేను’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
‘గోల్కొండ హైస్కూల్’ చిత్రంలో నటించిన దర్శకుడు శోభన్ తనయుడు ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అందుకే.. దర్శకుడు కొడుకుని అవికా వలలో వేసుకున్నట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ని చూస్తే.. ఇది ఒక ప్రేమకథా చిత్రమని అర్థమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలావరకు పూర్తయ్యిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు.