హాలీవుడ్ తరహాలో విజువల్స్, గ్రాఫిక్స్ ఇంత వరకు బాలీవుడ్ చిత్రాల్లోనే సాధ్యపడలేదు. మరి అలాంటిది ఒక తెలుగు సినిమాలో చూపించాలంటే... కానీ, దర్శకధీరుడు రాజమౌళి సుసాధ్యం చేసి చూపించాడు. తాజాగా రిలీజైన బాహుబలి సెకండ్ అఫీషియల్ ట్రైలర్ ను చూస్తే మతి పోవటం ఖాయం. గ్లాడియేటర్, 300, అవతార్, 10,000 బీసీ లాంటి చిత్రాలకు సరిపడా విజువల్స్ ను ఈ చిత్రంలో చూపిస్తాడని ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. మంచు కొండలు, యుద్ధ సన్నివేశాలు మరీ ముఖ్యంగా మాహిష్మతి నగరాన్ని చూస్తే ఆ కష్టం మాములుది కాదనిపిస్తుంది. అన్నదమ్ముల మధ్య పోరాటం అటుంచి పాత్రల పరంగానే కాదు, మేకింగ్ పరంగా, బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా కూడా మతిపోగొట్టాడు. ఏదేమైనా ఓ విజువల్ వండర్ ను జూలై 10న ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నాడన్నది మాత్రం సత్యం. అయినా క్వాలిటీ సినిమాలు తెలుగులో తీసేందుకు ఏ దర్శకుడికి సత్తా లేదన్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు నువ్వున్నావు కదా జక్కన్నా. ప్రేక్షకుల్లారా జూలై 10కి సిద్ధమైపోండి.