రెండేళ్లు విరామం లేకుండా చేసిన వెండితెర అద్భుతాన్ని ఎంత త్వరగా చూద్దామా అన్న కుతూహలంతో ఉన్న ఫ్యాన్స్ కు మరోసారీ సారీ చెప్పారు జక్కన అండ్ టీం. రిలీజ్ డేట్ మే నుంచి జులై కి జంప్ కాగా, రాజమౌళి ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఆడియో విడుదల పంక్షన్ లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మే 31న గ్రాండ్ గా ఆడియో పంక్షన్ చేసేందుకు సర్వం సిద్ధం చేసినప్పటికీ వేదిక దానికి అవాంతరమయ్యింది. దీనిపై కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన రాజమౌళి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. రెండేళ్లుగా ప్రభాస్ స్క్రీన్ కి, ఫ్యాన్స్ కి దూరమయ్యాడు. అందుకే బాహుబలి ఆడియోను గ్రాండ్ గా నిర్వహిద్దామనుకున్నాం. కానీ, పోలీసులు దానికి అడ్డుచెప్పారు. ఆదివారం కావటం పైగా బాగా రద్దీగా ఉండే హైటెక్స్ గ్రౌండ్ లో దీనిని నిర్వహించటంతో పరిమిత పాస్ లను పోలీసులు జారీచేశారట. దాదాపు 25,000 వేల మంది ఫ్యాన్స్ సమక్షంలో ఆడియోను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, పోలీసులు అడ్డుచెప్పారు. వారు చెప్పింది కూడా కరెక్ట్. భారీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏదైనా అపశృతి జరిగితే తట్టుకునే స్థితిలో లేమని రాజమౌళి తెలిపాడు. ఇక ప్రభాస్ మాట్లాడుతూ... సారీ డార్లింగ్స్ ఈ మధ్యలో ట్రైలర్ విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పాడు. మరీ ప్రస్తుత పరిణామం సినిమా విడుదల తేదీపై కూడా ప్రభావం లేకపోలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.