రిచ్ నెస్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. కానీ అనవసరంగా ఖర్చు చేయడానికి ఇష్టపడరట ఫర్ఫెక్టు డైరెక్టర్లు... నిర్మాతల్ని దొరికినంతా పిండుకోవడం అనే కాన్సెప్టు మారిపోయింది ఇప్పుడు. విజువల్ రిచ్‌నెస్, విజిబిలిటీ కోసమే ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదెవరూ. అలాంటప్పుడు అనవసర ఖర్చుల్ని తగ్గించాల్సిన బాధ్యత దర్శకుడిదే. ఇలాంటి మార్కెట్ సైన్స్‌లో ఆరితేరిపోయిన దర్శకుడు రాజమౌళి. అందుకే ఇప్పటివరకు బాహుబలి ప్రమోషన్‌కు ఒక్క రూపాయ్ కూడా పెట్టలేదు. అంతా ఫ్రీగా వచ్చిన హైపే. అయితే ఈరోజు అనూహ్యంగా బాహుబలి రిలీజ్ తేదీ ప్రకటనలు అన్నిచోట్లా కనిపించి షాకిచ్చాయి. ఇక సమరానికి సన్నద్ధులైపోయారు. అన్ని పనులు పూర్తయ్యాయని ఒక్క ప్రకటనతో చెప్పేశారు. ప్రభాస్, రానా ఫోటోలతో కూడిన పోస్టర్‌ని ‘జూలై 10న విడుదల’ అన్న ట్యాగ్‌లైన్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాను మారు మూల ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలనీ, ఇంతకు ముందు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపేలా ప్రమోట్ చేసుకుంటున్నారు బాహుబలి సినిమాని.