‘బాహుబలి’ని భేష్ అంటున్న బాలీవుడ్ విశ్లేషకులు

July 10, 2015 | 12:55 PM | 4 Views
ప్రింట్ కామెంట్
baahubali_stills_niharonline(5)

బాలీవుడ్ లో ఇక్కడిలా టికెట్ల కోసం థియేటర్ల దగ్గర క్యూలు కట్టలేదు... కానీ బెనిఫిట్ షో చూసిన విశ్లేషకులు మాత్రం భేషుగ్గా ఉందంటున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మళయాలంతో పాటు హిందీలో కూడా విడులైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హిందీ హక్కులను కొనుగోలు చేశారు. బాలీవుడ్ లో ప్రెస్ కోసం ఒక రోజు ముందుగానే స్పెషల్ షో వేసారు. పలువురు బాలీవుడ్ సినీ విశ్లేషకులు బాహుబలిపై ప్రశంసల వర్షం కురిపించారు. తరణ్ ఆదర్శ్, బాలీవుడ్ సినీ విశ్లేషకుడు.. బాహుబలి సినిమాలోని ప్రతిఫ్రేమ్ మాస్టర్ పీస్‌లా ఉంది, రాజమౌళి పని తీరు అద్భుతం, హాలీవుడ్ సినిమాల స్థాయిలో బాహుబలి ఉంది. రాజమౌళి జీనియస్. సినిమా కోసం వేసిన సెట్లు, విఎఫ్ఎక్స్, సౌండ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. తారాగణం అద్భుతం. ఎవరికి వారు తమ తమ పాత్రల్లో మెరిసిపోయారు. రానా, ప్రభాస్ పెర్ఫార్మెన్స్ అద్భుతం. బాహుబలి లాంటి సినిమా భారతీయులకు గర్వకారణం. బాహుబలి ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. బాక్సాఫీసు వద్ద ఇది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. ఇదొక రిమెంబర్డ్ క్లాసిక్. మరో వైపు హిందీ వెర్షన్ కు సంబంధించిన అక్కడ ప్రీమియర్ షో చూసిన వారంతా సినిమా అద్భుతంగా ఉందని, కలెక్షన్ల పంట పండుతుందనీ, బ్లాక్ బస్టర్ హిట్ అని పొగడ్తలు గుప్పిస్తున్నారు.  విశ్లేషకుల మాట ఇలా ఉంటే, ఇక ప్రేక్షకులు ఏమంటారో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ