బహుబలి సినిమా గురించి రెండు సంవత్సరాలుగా ఊరించేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇంతకు ముందు వచ్చిన ఆయన సినిమా మగధీర సినిమా ఓ చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే... ఆయకు రాజులు, రాణుల, రాజ్యాల పేర్లు ఎక్కడ దొరుకుతాయో, వీటి గురించి ఎంత గ్రౌండ్ వర్క్ చేస్తారో గానీ, చాలా అందంగా ఆప్ట్ గా అనిపిస్తాయి. మగధీరలో హీరోయిన్ పేరు మిత్రవింద కూడా చాలా అందంగా కొత్తగా, అప్పటి రాణుల పేరులాగానే ఎన్నో రాజుల కథలు చదివుంటాం... ఈ పేరు వినలేదు. అలాగే ఇప్పుడు బహుబలి రాజ్యం గురించి బయట పడింది. ఈ రాజ్యాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్టింగ్ వేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అప్పటి రాజుల కాలంలోకి వెళ్ళివచ్చే అనుభూతి కలిగేలా ఈ సెట్టింగ్స్ ను కళా దర్శకుడు సాబూ సిరిల్ సృష్టించాడు. మరి ఈ బాహుబలి రాజ్యం పేరు ‘మహిష్మతి’... ఈ పేరు ఎక్కడ దొరికిందో... కానీ... ఇది కూడా కొత్తగా... అందంగా ఈ రాజ్యం ఒకప్పుడు ఉండేదేమో అనుకునేలా ఉంది. మహిష్మతి రాజ్యం గురించి రాజమౌళి చెపితే వినాల్సిందే!