జక్కన చెక్కుడుమీద వీరాభిమాని అవేదన

June 02, 2015 | 01:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
rajamouli_prabhas_niharonline

బాహుబలి సినిమా గురించి తన అభిప్రాయాలను ముక్కుసూటిగా వ్యక్తం చేస్తూ ఓ తెలంగాణా అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉత్తరం ఇది. ఈ ఉత్తరం కొంత చమత్కారంగా, మరి కొంత సెటైరిక్ గా, ఆవేదనగా... హాస్యంగా... చక్కగా రాశారు. సమర్థించేవారు-సమర్థించని వారు అనే ఆడియన్స్ పోల్ పెడితే ఎలా ఉంటుంది? అనే ఓ చిలిపి ఆలోచనను మాలో రేపింది ఈ ఉత్తరం.... బహుశా సమర్థిస్తూనే ఎక్కువ ఓట్లు పడవచ్చని కూడా అనిపిస్తోంది... ఉత్తరం చదవండి... మీకూ అదే ఫీలింగ్ కలగవచ్చు....

హలో మిస్టర్ జక్కన… నీ చెక్కుడు జర ఆపుతావా…..? బాహుబలి అనే సినిమా పేరుతో ఎప్పడి నుండి నస పెడుతున్నవో నీకు తెలుసా….. ? మిర్చి సినిమాలో నాజూగ్గా ఉన్న పొల్లగాణ్ణి 200 కేజీలు పెంచితివి.. మా ప్రభాస్ ను మనిషనుకున్నావా? లేకపోతే మిషిననుకున్నావా…? ప్రభాస్ పెళ్లి జేసుకొని ఓ ఇంటోడు  కావాల్నా? అద్దా??

ఎడుపు గొట్టు తెలుగు సీరియల్ల గూడ గిన్ని ట్విస్టులుండవ్ గదా గడ్డపు సారూ, పోస్టర్ల మీద పోస్టర్లు, ఆ(వా)యిదాల మీద ఆయిదాలు, మద్యమద్యల పిచ్చెక్కించే మీ ట్వీట్లు….ఫస్ట్ లుక్కులు, టీజర్లు… అరె... ట్విట్టర్ అంటే తెలియని నేను మీ బాహుబలి అప్ డేట్స్ కోసం ట్విట్టర్ల పడిపోయా కదా జక్కన్న.

తీస్తే ఓ సినిమా తీయ్.... మా రామ్ గోపాల్ వర్మ లెక్క... సడీ సప్పుడు గాకుండ.... అరె ఒకటే ట్విట్టర్ల మోత… వాయిదాల బాట…అప్ డేట్ ల గోల….. మావూర్లె ఈరిగాడన్నట్టు  ముక్క తక్కువ... బొక్క ఎక్కువ అయ్యింది యవ్వారం.

హాలివుడ్ రేంజ్ ల సినిమా అని ఊరిస్తవ్, హిందీ హక్కుల కొనుగోళ్ల కోసం కరణ్ జోహర్ క్యూ లైన్లో నిలబడిండని ఉప్పందిస్తవ్….. విడుదల ఎప్పుడో క్లియర్ గ జెప్పవ్… నువ్వో పని జెయ్ జక్కన్న … గప్పున బోయి ఓ గుక్కెడు స్ప్రైట్ తాగు గప్పుడన్న నీ మాట సూటిగ సుత్తిలేకుండ వస్తదేమొ…?

మే  31న పాటలినిపిస్తనన్నవ్ … అరె మా ప్రభాస్ పాటలు ఇన్దాం అనుకుంటే గప్పట్ల గప్పుడే వాయిదా అన్నవ్…. పైకెళ్లి దాన్ని మరవగొట్టేందుకు టీజర్ రిలీజ్ జేసినవ్ .. అసలు 5 సెకండ్ల టీజర్ ఏంది బయ్… దానికేమైన తలుందా..? తోకుందా….? అప్పట్లాగనే ఏదో ఒక పోస్టర్ రిలీజ్ జేస్తే సరిపోయేది కదే… సప్పట్లు గొట్టి ఊరుకునే వాళ్లం… ఊరించి ఉసూరుమనిపించడం నీకు అలవాటైంది… నా లాంటి ఫ్యాన్స్ ను.

ఫస్ట్ లుక్ అంటివి, సెకండ్ లుక్ అంటివి, థర్డ్ లుక్ అంటివి… అరె అసలు ఎన్ని లుక్కులొదులుతావే జనాల మీదకు. తేపకో లుక్కు ,తడవకో పిక్కు  బీచ్ మే టీజర్, ఈటితోనే సినిమా  సూపిస్తవా ఏంది.??

అందం-రహస్యం అని అర్థంగాని రెండు ముక్కలు ట్వీటితివి.... అవంతిక అని తమన్న పోస్టర్ వదిలితివి.
ఆరడుగుల అనుష్క చేతికి సంకెళ్లేసి దేవసేన అని సూపితివి.
‘ప్రతి పదం లో విషం..ప్రతి అడుగు లో ఆగ్రహం..ప్రతి ఆలోచనలో అసూయ’.. అంటూ యేదో యేదాంతపు ముచ్చట్లు మూడంటివి… బిజ్జల దేవ పాత్రలో నాజర్ ఇరగదీసిండని మళ్లీ ఆశ రేపితివి…
రానా చేతిలో గదబెట్టి బల్లాలదేవ అని టెమ్ట్ జేయబడితివి…. మా యంగ్ రెబెల్ స్టార్ బుజాలమీన శివలింగం ఎత్తించి పస్ట్ లుక్ లోనే మాబోటి ఫ్యాన్స్ పానాలు తీస్తివి… చివరాకర్న చిన్నపొల్లగాన్ని నీల్లల్ల ఒంటి చేతితొ లేపిన ఇస్టైల్ జూసి … సినిమా టికెట్టుకయ్యే దుడ్లు గిప్పుడే జేబుల యేసుకునేలా జేస్తివి.

జక్కన్నో గిన్ని పోస్టర్లలో నేనొక కామన్ పాయింట్ కనిపెట్టిన్నే ….. గదేందో తెలుసా…. యాన్ ఎస్ ఎస్ రాజమౌళి ఫిల్మ్ అనే ముద్రనే… ఎందుకంటే నేను మా బుడ్డోడి స్టూడెంట్ నెంబర్ వన్ నుండి నేను నీకు ఫ్యాన్, కూలర్ ,ఏసిని మరి. నాకో డౌట్ ..? నీకు ఆ అర్జీవి సార్ గాలిగిట్టా సోకిందా …ఏంది?  ప్రీ పబ్లిసిటీల ఆయనను మించినవ్. అరె 12 నిమిషాల ఫైటింగ్ సీన్ లీక్ అయ్యిందని ఆగమాగం జేసినవ్…. గిప్పుడేమో టీజర్ ను థియేటర్ల రిలీజ్ చేస్తానని, ఆ థియేటర్ల లిస్ట్ ఇచ్చి కొత్త ట్రెండ్ కు తెర లేపినవ్.

సరే చివరాకర్న ఒక్క మాట ఎంత టైం అయినా దీసుకో… గానీ మగధీర ను మించిన సినిమా తీసి నా చేత శభాష్ అనిపించుకోవాలే. నూ తీస్తవ్, నువ్వే తీయగలవ్, ఎందుకంటే చిన్న జీవం ఈగ తోనే  తెలుగోళ్ల కానుండి అంగ్రేజోళ్ల వరకు అందరితో  వెర్రి గుడ్ అనిపించినవ్.. అందుకే ఐ లవ్ యూ రాజా…..  మా ప్రభాస్ జర జాగ్రత్త.

శనార్తి…….

మీ తెలంగాణా పోరగాడు

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ