భారతీయ సినిమా ప్రతిష్ఠను... అందునా తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ‘బాహుబలి’ సినిమాక మరో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆహ్వానం అందుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా ప్రపంచ ప్రేక్షకులందరూ చూడాలని ఇప్పటికే చాలా ప్రపంచ భాషల్లో సినిమాను తర్జుమా చేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్ ఇంటర్నేషనల్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించారు.
ఇప్పటికే భుసన్, టొరంటో లాంటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న బాహుబలి, త్వరలోనే జపాన్, చైనాల్లో కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆసియాలో మంచి పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్ అయిన ‘తైపై గోల్డెన్ హార్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితం కానుంది. థైవాన్‌లో అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్‌గా పేరున్న ఈ ఫెస్టివల్ నవంబర్ 5 నుంచి 26 వరకూ జరుగనుంది. ఇక ఈ ఫెస్టివల్‌లో ‘బాహుబలి’ సినిమా నవంబర్ 7, నవంబర్ 26వ తేదీల్లో ప్రదర్శితం కానుంది.