ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లయన్ విడుదవవ్వడం, ఇప్పుడు డిక్టేటర్ కూడా మొదలెట్టారు. బాలయ్య అభిమానులు ఆయన వందో చిత్రం కూడా చూడాలని ఆత్రుత పడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్ లో 99వ సినిమా డిక్టేటర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నారు. డిక్టేటర్ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నట్టు ఇంతకు ముందే ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిక్టేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా, బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు బి.గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్, ధశరథ్, జెమినీ కిరణ్ లు హాజరయ్యారు.
ఈ సినిమాను కొత్త టీంతో చేస్తున్నట్టు, ఇది యాక్షన్, ఫ్యామిలీ, ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ కాన్సెప్టుతో రూపొందిస్తున్నట్టు, ఈ కాన్సెప్ట్ తప్ప కుండా అందరికీ నచ్చుతుందని బాలయ్య తెలిపారు. కథ చాలా కొత్తగా ఉందనీ, కోన వెంకట్, గోపీ మోహన్ చక్కని కథ అందించారన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్, కెమెరా శ్యామ్ కె.నాయుడు అందిస్తున్నారు. ఫైట్స్ రవి వర్మ, ఆర్ట్ బ్రహ్మకడలి, గౌతం రాజు ఎడిటింగ్ చేస్తున్నారు. బాలయ్య సరసన మొదటి సారిగా అంజలి హీరోయిన్ గా నటించనుంది. చిత్రంలో ఇంకో హీరోయిన్ కూడా ఉందని తెలిపారు.