త్వరలోనే తెరంగేట్రానికి సిద్ధ మవుతున్న ఈ నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఈ రోజు (సెప్టెంబర్ 6) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్ ఐదు తెలుగు రాష్ట్రాల్లో 200 ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తూ భారీ ఎత్తున సేవాకార్యక్రమాలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.బి.కె.హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్, ఛైర్మన్ జగన్ మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా వినాయక పూజ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో సేవాకార్యక్రమాలు నిర్వహింపబడతాయి.
బళ్ళారిలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం, క్యాన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ కాలేజీలకు చెందిన ఇంజీరింగ్, ఎం.బి.ఎ సహా యువత సేవాకార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి నందమూరి అభిమానులు ఈ మెడికల్ క్యాంప్, మొక్కలు నాటే కార్యక్రమం, రక్తదానం, హాస్పిటల్ లోని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.