‘బెంగుళూరు డేస్’ రీమేక్ లో నిత్య

December 19, 2014 | 03:10 PM | 54 Views
ప్రింట్ కామెంట్

మలయాళంలో హిట్టయిన 'బెంగళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో దిల్ రాజు రీమేక్ చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా మలయాళం ఒరిజినల్ లో నిత్యా గెస్ట్ పాత్ర చేసింది. ఇప్పుడు తెలుగులో మాత్రం హీరోయిన్ గా పూర్తి స్థాయి పాత్రలో నటించనుంది. ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ఇటీవలే నిత్యను కలసి చర్చించినట్టు, ఆమె తన అంగీకారం తెలిపినట్టు చెబుతున్నారు. ఆర్యాకు జంటగా ఆమె నటిస్తుంది. విశేషం ఏమిటంటే, ఇదిలా ఉంచితే, సిద్ధార్థ్, సమంత మరో జంటగా నటిస్తారనీ, మూడో జంట ఎంపిక జరుగుతోందనీ అంటున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ