హిందీ దృశ్యం ఫ్లాప్ కు కారణం?

September 14, 2015 | 04:36 PM | 2 Views
ప్రింట్ కామెంట్
drishyam-poster-niharonline

హిందీ దృశ్యం ఫ్లాప్ అవడానికి కారణం శ్రీయ అంటున్నాడు ఈ చిత్రం మళయాళ దర్శకుడు... ఇది చాలా అన్యాయం కదా? తల్లిగా ఆమె కరెక్టు కాకపోయినా ఆ లోపం దర్శకుడిదే అవుతుంది కానీ, శ్రీయది మాత్రం కాదు.... అయినా స్క్రీన్ ప్లే సరిగ్గా వస్తే... ఫ్లాప్ టాక్ తెచ్చుకునే స్టోరీ కాదది. నటుల లోపం ఏ మాత్రం ఉండదు. ఈ సినిమా మళయాళ, తెలుగు, తమిళ్ ఆ తరువాత హిందీ భాషల్లో రీమేకైంది. మూడు చోట్లా హిట్ అయిన ఈ సినిమా... ఇద్దరు పిల్లల తల్లిగా మీనా నటన చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. గౌతమి కూడా ఆ పాత్రకు న్యాయం చేసింది. హిందీలో మాత్రం ఇదే పాత్రలో నటించిన శ్రియ లోపం ఉందంటున్నారు. బాలీవడ్ లో కలెక్షన్ బాగానే వచ్చినా... హిట్ టాక్ మాత్రం రాలేదు. ఈ సినిమాకు  హిందీ దర్శకత్వం వహించింది నిషికాంత్ కామత్. నింద దర్శకుడిపై వేయకుండా ఇప్పుడు కాస్టింగుపై వేస్తున్నారు జీతూ జోసెఫ్. ఈయన మలయాళ వెర్షన్ కి దర్శకత్వం వహించాడు. జీతూ అన్ని భాషల చిత్రాల్ని విశ్లేషించి, కాస్టింగ్ ఫెయిల్యూర్ వల్లే హిందీ దృశ్యం ఫ్లాపయిందంటున్నాడట. అక్కడ శ్రీయ తల్లిగా పనికిరాలేదంటున్నాడట. దృశ్యానికి స్క్రీన్ ప్లే కరెక్టుగా కుదిరితే కాస్టింగ్ లోపం పెద్ద గా ఉండదని సామాన్య జనాలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సినిమా వల్ల శ్రీయకు చెడ్డపేరు తప్పలేదు పాపం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ