బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమా అల్లుడు శీను విడుదలైంది. రెండో సినిమా భీమినేని శ్రీనివాస్ తో ఖరారైంది. తాజాగా మూడో సినిమా జూలైలో మొదలుకానుంది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు రాపర్తి రమేష్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అడ్డాల చంటి నిర్మాత. తన ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై రూపొందించనున్నారు. ఆయన ప్రస్తుతం నరేష్ తనయుడితో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఇద్దరు అగ్ర హీరోలు కూడా నటిస్తారని సమాచారం. జూలైలో లాంఛనంగా సినిమాను మొదలుపెట్టనున్నట్టు నిర్మాత అడ్డాల చంటి తెలిపారు. భారీ బడ్జెట్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ఆయన అన్నారు.