నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే ‘అల్లుడుశీను’తో సినీ ఫీల్డ్ లోకి ఎంటరయ్యాడు. ఈ సినిమా తరువాత ఈ హీరో మళ్ళీ భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. అయితే మొదటి సారి సమంతతో చేసిన శీను ఇప్పుడు జాదుగాడు హీరోయిన్ సోనారికతో చేస్తున్నాడు. ఈ హీరోయిన్ చేసిన సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. ఇటీవలే అల్లు అర్జున్ కొత్త సినిమాలో సొనారికాకు ఆఫర్ వచ్చినట్లుగా తెలిసింది. అయితే బెల్లం కొండ శ్రీనివాస్ చేస్తున్న చిత్రం తమిళంలో ‘సుందర్ పాండియన్’గా, కన్నడంలో ‘రాజహులి’గా రూపొందిన చిత్రాలకు రీమేక్. ఆ రెండు భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది. ఈ చిత్రానికి కథ-ఎస్.ఆర్.ప్రభాకరన్, మాటలు- భీమనేని శ్రీనివాస్ రావు, ప్రవీణ్, సినిమాటోగ్రఫి-విజయ్ ఉలగనాథ్, సంగీతం- శ్రీ వసంత్, ఎడిటింగ్- గౌతంరాజు, ఆర్ట్ - కిరణ్ కుమార్, పబ్లిసిటి డిజైనర్ - ధని ఏలె, కాస్టూమ్స్ -శివ, ఖాదర్, స్టిల్స్ - కటారి, కో డైరెక్టర్ -రాంగోపాల్ చౌదరి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - బండిశేషయ్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల, సమర్పణ- భీమనేని రోషితా సాయి, మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్ రావు, నిర్మాత- భీమనేని సునీత.