మలయాళంలో విజయవంతమైన 'బెంగళూర్ డేస్' చిత్రాన్ని దిల్‌రాజు, పివిపి సంస్థలు సయుక్తంగా నిర్మించనున్న సంగతి విదితమే. తమిళంలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. రానా, ఆర్య, శ్రీదివ్య, బాబి సింహ తదితరులు లాంఛింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తమిళంలో డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ 'బెంగళూర్ డేస్'కి సంగీతాన్ని సమకూర్చిన గోపిసుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇక్కడ నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేసి సినిమాని తెరకెక్కించనున్నారని యూనిట్ సభ్యులు తెలియజేశారు. మరి తెలుగులో వరుణ్‌తేజ్, శర్వానంద్, నిత్యామీనన్‌లు నటించనున్న ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో మరి...