విభిన్నమైన కాన్సెప్ట్ లతో లిమిటెడ్ బడ్జెట్ లో చిత్రాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్న మారుతి టీం వర్క్స్ ప్రోడక్షన్ లో సినిమా లవర్స్ సినమా బ్యానర్ లో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా సిద్దమైన చిత్రం బెస్ట్ యాక్టర్స్. ఉర్వశి ధియోటర్స్ అసోసియోషన్ తో ఈ చిత్రం చేస్తున్నారు. నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్ , మదురిమ, కేషా, క్రితి, షామిలి, భార్గవి లు జంటలుగా నటిస్తున్నారు. కుమార్ అన్నంరెడ్డి నిర్మాతగా అరుణ్ పవర్ ని దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథాచిత్రమ్, కొత్తజంట, లవర్స్ లాంటి సూపర్‌డూపర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన జీవన్ బాబు(జె.బి) అందించిన ఆడియో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ ఆడియో ఇప్పటికే యూత్ ని బాగా ఆకట్టుకోవటం విశేషం.అంతేకాకుండా చిత్రం యెక్క ధియోట్రికల్ ట్రైలర్ నెట్ లో విశేషంగా ఆకట్టుకోవటంతో యూనిట్ సభ్యులు సంతోషంతో వున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత కుమార్ అన్నంరెడ్డి మాట్లాడుతూ" దాదాపు చాలా గ్యాప్ తీసుకుని బిజినెస్ వైపుకు టర్నయిన నేను చిన్న చిత్రాల్ని క్యూట్ గా లిమిటెడ్ బడ్జెట్ తో ప్రెజెంట్ చేస్తున్న మారుతి టీంవర్క్స్ చూసి తెలుగు సినిమాకి మంచి రోజుల వచ్చాయనే వుద్దేశంతోనే తిరిగి చిత్రాల్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాను. అందుకే మారుతి టీంవర్క్స తో అనుభందంగా మా బ్యానర్ సినిమా లవర్స్ సినిమా పై ఖర్చుకు ఏమాత్ర వెనకాడకుండా మా దర్శకుడు అరుణ్ పవర్ చెప్పిన కథ నచ్చి బెస్ట్‌యాక్టర్స్ చిత్రం చేశాం. దర్శకుడు పూర్తి వినోదాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే చక్కటి క్లైమాక్స్ ని అందిచాడు. నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు జీవితాల్లో మరో కొంతమంది ఎంటరయ్యి వారి జీవితాల్ని ఎలా మార్చారు చివరకి ఏమయ్యింది అనేది చిత్రం. సెకండాఫ్‌లో సప్తగిరి వచ్చి చేసే కామెడి కి హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఆడియో సూపర్‌డూపర్ హిట్ అవ్వటం హ్యపిగా వుంది.ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాము. "అని అన్నారు
దర్శకుడు అరుణ్ పవర్ మాట్లాడుతు."వరుస విజయాలతో టాలీవుడ్ లో సక్సస్ బ్రాండ్ గా పేరుగాంచిన మారుతి గారికి ఈ కథ చెప్పాను, కథ కంటే కథనం చాలా బాగుందన్నారు. తరువాత నిర్మాత కుమార్ గారికి చెప్పి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న చిత్రాల రాజమౌళి మారుతి గారు నాలాంటి కొత్త వారికి అవకాశాల్ని ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు వారికి నా దన్యవాదాలు. ఈ చిత్రం నాలుగు జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది మెయిన్ కాన్సెప్ట్ వినోదం తో చెప్పాం. సెకండాఫ్ లో సప్తగిరి చేసే అల్లరి అంతాఇంతా కాదు. మారుతి గారి బ్యానర్ సప్తగిరి అంటే నవ్వులకి కొదవుండదు. అలానే అందరూ నటీనటులు సూపర్బ్ గానటించారు. జె.బి గారు అందించిన సూపర్బ్ మ్యూజిక్ ఇప్పటికే పేద్ద విజయవంతమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 19 న చిత్రాన్నిప్రేక్షకుల ముందుకు విడుదల తీసుకువస్తాము" అని అన్నారు. నందు, మధు నందన్, అభిషెక్ మహర్షి, నవీద్ , మదురిమ, కేషా . క్రితి, షామిలి, భార్గవి , సప్తగిరి, తాగుబోతు రమేష్, కుమార్‌సాయి తదితరులు.. ఆర్ట్:గోవింద్, పి.ఆర్.ఓ:ఏలూరు శ్రీను, కో-డైరక్టర్: గౌతమ్ మన్నవ, సంగీతం: జె.బి, ఎడిటింగ్: ఉద్దవ్.ఎస్.బి, కెమెరా: విశ్వ.డి.బి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: దాసరి వెంకట సతీష్, సహ-నిర్మాతలు: సందీప్ సేనన్, అనీష్.ఎమ్.థామస్, నిర్మాత:కుమార్ అన్నంరెడ్డి, దర్శకత్వం: అరుణ్ పవర్.