ఇప్పటి సినిమాలకు భిన్నంగా ‘బాహుబలి’

January 12, 2015 | 04:43 PM | 26 Views
ప్రింట్ కామెంట్

సినిమాలు తీయడంలో ఒకప్పటిలా కాకుండా గబగబా ముగించేస్తున్నారిప్పుడు. ఒకప్పుడైతే సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఉన్నాయి. ప్రతి సీన్ చాలా శ్రద్ధగా చూసేవారు సినిమా డైరెక్టర్లు. ఇప్పుడు 24 విభాగాల్లో కొన్నిటిలో డైరెక్టర్ల ఇన్ వాల్వ్ మెంట్ ఉండడం లేదు. ఆ విభాగాల్లోని హెడ్ లకు ఆ బాధ్యతలను అప్పగించడం వల్ల డైరెక్టర్ల పని తేలికవుతుంది. తన సినిమాలను కనీసం ఏడాది షూటింగ్ చేసే త్రివిక్రమ్ సైతం నాలుగు నెలల్లోపే అల్లు అర్జున్ కొత్త సినిమాను పూర్తి చేశాడు. కానీ రాజమౌళి మాత్రం ‘బాహుబలి’క్లైమాక్స్ మాత్రమే నాలుగు నెలలు తీశాడట. ఈ విషయాన్ని ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన రానా దగ్గుబాటే స్వయంగా తెలిపాడు. బాహుబలి క్లైమాక్స్‌ను వివిధ ప్రాంతాల్లో 120 రోజుల పాటు చిత్రీకరించినట్లు వెల్లడించాడు. అంతే కాక.. ‘బాహుబలి’ షూటింగ్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు రానా. బాహుబలి రెండు భాగాలుగా తెరకెక్కుతోందని.. తొలి భాగం చిత్రీకరణ దాదాపు పూర్తయిందని.. రెండో భాగం కూడా 60 శాతం అయిపోయిందని వెల్లడించాడు. బాహుబలి 2013 మధ్యలో సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఏడాదిన్నరగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఇండియాతో పాటు విదేశాలకు వెళ్లి క్లైమాక్స్ చిత్రీకరించారు. ఈ ఏడాది వేసవిలో తొలి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగాన్ని ఏడాది ఆఖర్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. విడుదల కాబోయే సినిమాల్లో ఆసక్తిగా ఎదురు చూసే సినిమాల్లోకి ఇండియా మొత్తం మీద బాహుబలి ఐదవ స్థానాన్ని ఆక్రమించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ