బాలయ్య తోడ డైలాగులు ఎవరికోసం?

December 21, 2015 | 12:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
balayya-dailogues-in-Dictator-niharonline

నందమూరి ఫ్యామిలీ అంటేనే మాస్ డైలాగులకు పెట్టింది పేరు. అలాంటిది బాలయ్య నోటి నుంచి ఆ డైలాగులు వస్తే అవి ఇంకా పవర్ ఫుల్. థియేటర్లకు వచ్చే అభిమానులను తన డైలాగులతో కేకలు పెట్టించే సత్తా నట సింహ నందమూరి బాలకృష్ణది. ఇక ఆయన నటించిన 99వ చిత్రం డిక్టేటర్ పాటల వేడుక నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో బాలయ్య డైలాగులతో మతిపోగొట్టాడు.

పర్వతం ఎక్కు ఫర్వాలేదు... ఎత్తాలని చూడకు పైకిపోతావ్... ` `మీరు ఏం చేసినా పబ్లిసిటీ చేస్తారు. కానీ నేను ఏం చేసినా అది పబ్లిసిటీ అవుతుంది`... `నా పేరు ధర్మ నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్. నీ చావు చూడాలంటే దాన్ని టచ్ చేసి చూడు... ఇక ముఖ్యంగా చివర్లో వచ్చే డైలాగులు కేక పుట్టించింది. `దాహం వేస్తే సింహం కూడా తలదించుకొనే నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన తలదించుకుందని తొడగొట్టకు. కొట్టడానికి తొడ ఉండదు ఎత్తడానికి తలా ఉండదు`.  అంతేకాదు ఆడియో వేడుకలో  అవి తానే చెప్పి సినిమాలో సంభాషణల పర్వం ఎలా ఉందో మచ్చుకు రుచి చూపాడు బాలయ్య.  అయితే ఇక్కడ తోడల డైలాగులు ఎక్కువగా వాడేది నందమూరి ఫ్యామిలీనే. మరి అలాంటిది ఆయన డైలాగులు ఎవరిని ఉద్దేశించినవోనని ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ