నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉన్నారు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలో ప్రీ ఇండిపెండెన్స్ కు సంబంధించిన సన్నివేశాలు కీలకం. అందుకోసం భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఈ సినిమా కోసం ఓ సెట్ ను ఏర్పాటు చేశారు. నానక్ రామ్ గూడలోని రామానాయుడు సినీ విలేజ్ లో ఏర్పాటు చేసిన ఈ సెట్ చూడ్డానికి స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న సెట్ లాగానే అనిపిస్తోందట. ప్రగ్యా జైశ్వాల్ ఈ చిత్రంలో నాయిక పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కంచె’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.