బర్త్ డే స్పెషల్ : సోగ్గాడి నాయిక మంజుల

September 09, 2015 | 04:33 PM | 1 Views
ప్రింట్ కామెంట్
manjula_vijayakumar_birthday_special_niharonline.jpg

70వ దశకం నుంచి దాదాపు మూడేళ్లపాటు దక్షిణాది భాషల్లో ఓ వెలుగు వెలిగిన అందాల నాయిక మంజుల. బాల నటిగా కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత కథానాయికగా ఎదిగిన తారల్లో ఆమె ఒకరు. ఆ టైంలో బికినీ కి ఆద్యం పోసిన నాయికల్లో ఈమె ఒకరు. శ్రీదేవి కన్నా ముందే ఆ ఘనత సాధించిన వ్యక్తిగా మంజుల పేరు పడ్డారు. ముఖ్యంగా శోభన్ బాబుతో ఎక్కువ సినిమాల్లో నటించడమే కాదు అవన్నీ ఆల్ టైం హిట్స్ గా నిలవడంలో ముఖ్య భూమిక పోషించారు. ఈరోజు (సెప్టెంబర్ 9) ఆమె పుట్టిన రోజు ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ప్రత్యేక కథనం...

తమిళంలో కెరీర్ ను ముందుగా ప్రారంభించిన ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా శివాజీ గణేశన్ సరసన నటించిన ఆమె. ఆతర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. హీరోయిన్ గా నటిస్తున్న రోజుల్లో తమిళ చిత్రం ఉన్నిడమ్ మయంగుహిరేన్ లో గెస్ట్ రోల్ చేసిన విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకుంది. వారికి ప్రీత, వనిత, శ్రీదేవి ముగ్గురూ కూడా తెరపై తారలుగా వెలుగొందారు.    కెరీర్ ప్రారంభదశలోనే జెమినీ గణేశన్, ఎంజీఆర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో జై జవాన్ ఆమె మొదటి చిత్రం. ఆ తర్వాత కత్తుల రత్తయ్య, మగాడు, మనుషులంతా ఒక్కటే, మగాడు, మా ఇద్దరి కథ, దొరబాబు, మహాకవి క్షేత్రయ్య, బంగారు బొమ్మలు, మాయదారి మల్లిగాడు, దేవుడు లాంటి మనిషి తదితర చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా అందాల నటుడు శోభన్ బాబుతో ఆమె నటించిన చిత్రాలు ఆల్ టైం హిట్లుగా నిలిచాయి. మంచి మనుషులు, పిచ్చి మారాజు, ఇద్దరూ ఇద్దరే, మొనగాడు, తదితర చిత్రాలలో ఆమె శోభన్ బాబుతో నటించారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు జగపతి ఆర్ట్స్ బ్యానర్ లోనే కావటం విశేషం. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం వాసు. ఇందులో ఆమె తన రియల్ లైఫ్ పార్టనర్ విజయ్ కుమార్ భార్యగా ఆమె కనిపించింది. తన 60వ ఏటా (జులై 23, 2013 లో )తీవ్ర అనారోగ్యంతో ఆమె చెన్నైలోని ఆమె స్వగృహంలో మృతిచెందారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ